వ‌ర‌ద‌ భాధితులకు సహాయం

విలీన మండ‌లాల ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల‌తో స‌ర్వం కోల్పోయారు. ప్ర‌భుత్వం ఆదుకోక‌పోవ‌డంతో నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. వీరి దుర్భ‌ర ప‌రిస్థితిని స్వ‌యంగా చూసిన టిడిపి జాతీయ అధ్య‌క్షులు చంద్ర‌బాబు గారు చ‌లించిపోయారు. బాధితుల‌కు స‌హాయం అందించాల‌ని చంద్ర‌బాబు గారు ఇచ్చిన పిలుపు మేర‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నా వంతుగా 4 ట‌న్నుల బియ్యం, 2 ట‌న్నుల కూర‌గాయ‌ల‌ను లారీతో పంపించాను. దాత‌లు, టిడిపి నేత‌లు స్పందించి వ‌ర‌ద పీడితుల‌కు స‌హాయం అందించాల‌ని కోరుతున్నాను.

తాడేపల్లి టీ డీ పీ కార్యాలయం ప్రారంభోత్సవం

మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి బైపాస్ వద్ద నూతనంగా నిర్మించిన తాడేపల్లి మండల టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించాను. ఈ సంద‌ర్భంగా కుంచనపల్లి గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలకు ప‌సుపు కండువాలు క‌ప్పి టిడిపిలోకి ఆహ్వానించాను. వారంలో దుగ్గిరాలలో సంజీవని ఆరోగ్య రథం ప్రారంభిస్తాం. త్వ‌ర‌లో మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి, దుగ్గిరాల‌లో సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. అంతా క‌లిసి ఇగోలు పక్కన పెట్టి పనిచేయండి. మంగళగిరిలో ప‌సుపు జెండా ఎగరేస్తున్నాం.